mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 12:40 pm Digital Edition : Namastey Mahaaprabha

సూచీలకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1300 పాయింట్లు డౌన్.. కారణాలు ఇవే..

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం దేశీయ సూచీలకు ప్రతికూలంగా మారింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 4.3 శాతం పెరిగి 105 డాలర్లు చేరుకుంది. మరోవైపు శుక్రవారం విదేశీ మదుపర్లు రూ.4110 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

మే 11 ( మహాప్రభ ) : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం దేశీయ సూచీలకు ప్రతికూలంగా మారింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 4.3 శాతం పెరిగి 105 డాలర్లు చేరుకుంది. మరోవైపు శుక్రవారం విదేశీ మదుపర్లు రూ.4110 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడం కూడా సూచీల నష్టాలకు కారణంగా మారింది (Indian stock market).

పశ్చిమాసియలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా పొదుపు చర్యల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా సూచీలను కిందకు లాగాయి. అలాగే ఇరాన్-అమెరికా మధ్య తాజా శాంతి చర్చలు కూడా ఫలించకపోవడం ప్రతికూలంగా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.31) మరింతగా పతనమైంది. ఇన్ని ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను చవిచూశాయి.

గత సెషన్ ముగింపు (77,328)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 700 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 1312 పాయింట్ల నష్టంతో 76,015 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 360 పాయింట్ల నష్టంతో 23,815 వద్ద స్థిరపడింది (stock market news today).

సెన్సెక్స్‌, నిఫ్టీలో వోడాఫోన్ ఐడియా, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్, యూపీఎల్, లారస్ ల్యాబ్స్, టొరెంట్ ఫార్మా మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). కల్యాణ్ జువెల్లర్స్, ఏబీబీ ఇండియా, టైటాన్ కంపెనీ, స్విగ్గీ, సీమన్స్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 870 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 852 పాయింట్లు నష్టపోయింది.