సీబీఎస్ఈ విద్యా విధానంలో కీలక మార్పు.. 6వ తరగతి నుంచే మూడో భాష!

సీబీఎస్ఈలో ఇకపై ఆరో తరగతి నుంచి మూడో భాష ఎంపిక విధానం అమలు కానుంది. ఎన్ఈపీ-2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. ఇంటర్నెట్ డెస్క్ , ఫిబ్రవరి 27 మహాప్రభ: దేశంలో త్రిభాషా సూత్రం మరోసారి తెరపైకి వచ్చింది. ఇకపై 6వ తరగతి నుంచే మూడో భాష ఎంపికను ప్రవేశపెట్టనుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడుకేషన్(సీబీఎస్ఈ). జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)-2020 మార్గదర్శకాలకు అనుగుణంగా దీనిని తప్పనిసరి చేసింది. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తించనుంది.సవరించిన నిబంధనల ప్రకారం.. 6వ...