సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం.. ట్రైన్ ఎక్కుతూ కింద పడి వ్యక్తి మృతి..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇవాళ (శనివారం) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిన వ్యక్తి తీవ్ర గాయాలతో మృతిచెందాడు.. సికింద్రాబాద్, ఫిబ్రవరి 21 మహాప్రభ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో (Secunderabad Railway Station Accident) ఇవాళ (శనివారం) విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిన వ్యక్తి.. తీవ్ర గాయాలతో మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, రైల్వే ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగించింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు....