mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 11:51 am Digital Edition : Namastey Mahaaprabha

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం.. ట్రైన్ ఎక్కుతూ కింద పడి వ్యక్తి మృతి..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇవాళ (శనివారం) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిన వ్యక్తి తీవ్ర గాయాలతో మృతిచెందాడు..

సికింద్రాబాద్, ఫిబ్రవరి 21 మహాప్రభ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో (Secunderabad Railway Station Accident) ఇవాళ (శనివారం) విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిన వ్యక్తి.. తీవ్ర గాయాలతో మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, రైల్వే ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగించింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

రైలు కదులుతున్న సమయంలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు అనే వ్యక్తి సికింద్రాబాద్ నుంచి ఒంగోలు వెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చాడు. సింహపురి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కాల్సి ఉండగా.. తొందరలో మరో ట్రైన్‌ను ఎక్కేందుకు ప్రయత్నించాడు. ట్రైన్ కదులుతున్న సమయంలో కాలు జారి ప్లాట్‌ఫామ్‌కు, ట్రైన్‌కు మధ్యలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలై మృతిచెందాడు.

పోలీసుల సూచనలు..

ఈ ఘటన మరోసారి రైల్వే ప్రయాణికులకు అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేసింది. ట్రైన్ కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నించకూడదని, అలాంటి చర్యలు ప్రాణాపాయానికి దారి తీస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నాగరాజు మృతితో.. టుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.