mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 11:44 am Digital Edition : MAHAA PRABHA DAILY

సర్‌చార్జి బాదుడు.. ఆకాశ ఎయిర్ టిక్కెట్ ధరలకు రెక్కలు

విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానాయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు టిక్కెట్ ధరపై ఇంధన సర్‌ఛార్జి విధించాయి. తాజాగా ఆకాశ ఎయిర్ సైతం టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్టు శనివారంనాడు ప్రకటించింది.

న్యూఢిల్లీ మార్చి14 మహాప్రభ : పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం విమానయాన రంగంపై ప్రభావం చూపుతోంది. విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు టిక్కెట్ ధరపై ఇంధన సర్‌ఛార్జి విధించాయి. తాజాగా ఆకాశ ఎయిర్ (Akasa Air) సైతం టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్టు శనివారంనాడు ప్రకటించింది. దేశవాళీ, అంతర్జాతీయ రూట్లలో రూ.199 నుంచి రూ.1,300 వరకూ సర్‌ఛార్జీలను విధిస్తున్నట్టు తెలిపింది. మార్చి 15వ తేదీ నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది.