సమస్యల మీద స్పష్టత.. పరిష్కారాలపై అవగాహన.. పక్కా ప్రణాళిక.. హడావిడి నిర్ణయాలకు బదులు దీర్ఘకాల ప్రయోజనాల మీద ఫోకస్. అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించాలన్నదే తన ధ్యేయం అంటున్నారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) తొలి కమిషనర్ జి. సృజన.
- ప్రతీ ఫిర్యాదుకు ఒక యూనిక్ ఐడీ.. విశాఖలో విజయవంతంగా అమలు చేశాం
- అంతర్గత రోడ్ల నిర్మాణానికి పక్కా ప్రణాళిక..శానిటేషన్‌కు అత్యంత ప్రాధాన్యత
- అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు..సోషల్‌మీడియాలో సమస్యల పోస్టులపై ప్రత్యేక ఫోకస్
- అపాయింట్‌మెంట్ అక్కర్లేదు.. నేరుగా కలవొచ్చు
- ‘ఆంధ్రజ్యోతి‘తో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్ జి.సృజన
హైదరాబాద్ సిటీ ఫిబ్రవరి 12 మహాప్రభ: సమస్యల మీద స్పష్టత.. పరిష్కారాలపై అవగాహన.. పక్కా ప్రణాళిక.. హడావిడి నిర్ణయాలకు బదులు దీర్ఘకాల ప్రయోజనాల మీద ఫోకస్. అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించాలన్నదే తన ధ్యేయం అంటున్నారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) తొలి కమిషనర్ జి. సృజన. వాట్సాప్‌లో ఫిర్యాదు చేస్తే చాలు.. సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఆమె కమిషనర్ హోదాలో ‘ఆంధ్రజ్యోతి‘తో ప్రత్యేకంగా మాట్లాడారు
మహాప్రభ: ఈ కార్పొరేషన్‌లో అంతర్గత రోడ్ల సమస్య అధికంగా ఉంది. దీనిపై మీ కార్యాచరణ?కమిషనర్: అంతర్గత రోడ్లపై ప్రత్యేక దృష్టి పెడతాం. గడిచిన నాలుగేళ్లలో వేసిన రోడ్లు.. వాటి తాజా పరిస్థితి మీద మదింపు జరుపుతాం. డివిజన్ల వారీగా అంతర్గత రోడ్ల అవసరాలపై కార్యాచరణ సిద్ధం చేస్తాం. ప్రాధాన్యతాపరంగా మూడు నాలుగేళ్ల వ్యవధిలో అంతర్గత రోడ్లను నిర్మిస్తాం.
మహాప్రభ: డివిజన్ల వారీగా సమస్యల పరిష్కారంపై?
కమిషనర్: అందుకోసం సమగ్ర డివిజన్ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను గూగుల్ మ్యాప్ ఆధారంగా సిద్ధం చేయనున్నాం. డివిజన్‌లలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారిస్తాం.
మహాప్రభ: మున్సిపల్ సిబ్బంది పనితీరుపై పెద్ద ఎత్తున వస్తన్న ఫిర్యాదులపై మీ స్పందన?
కమిషనర్: సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచుతాం. ఫిర్యాదులపై వేగవంతమైన చర్యలు ఉంటాయి. సమస్యలను పరిష్కరించగలిగితే పరిష్కరిస్తా.. కుదరని పక్షంలో వెంటనే చెప్పేస్తా. నానుస్తూ.. తిప్పించుకోవటానికి నేను వ్యతిరేకం. నా సిబ్బంది కూడా ఇదే రీతిలో వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకుంటా.

మహాప్రభ : అక్రమ నిర్మాణాలపై చర్యలు ఉంటాయా?
కమిషనర్: అక్రమనిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. మాకొచ్చే ఫిర్యాదులను జాగ్రత్తగా పరిశీలిస్తాం. కొందరు తప్పుడు ఫిర్యాదులు కూడా చేస్తుంటారు. అందుకే ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిస్తాం.
మహాప్రభ: సమస్యలు చెప్పుకోవాలనుకునే వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటారు?కమిషనర్: నన్ను కలుసుకునేందుకు, సమస్యలు చెప్పేందుకు ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ అవసరం లేదు. నేను ఆఫీసులో ఉంటే నేరుగా వచ్చి కలవొచ్చు. సోషల్ మీడియాలో పోస్టు చేసే సమస్యల మీద ప్రత్యేకంగా ట్రాక్ చేసి.. వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. మాకు వచ్చే ప్రతీ ఫిర్యాదుకు ఒక యూనిక్ ఐడీ ఇచ్చి వాటిని పరిష్కరిస్తాం. విశాఖపట్నంలో కమిషనర్‌గా పని చేసినప్పుడు ఈ విధానాన్ని అమలు చేశాం. సత్ఫలితాలు వచ్చాయి. త్వరలోనే సీఎంసీ వాట్సాప్ నెంబరును ప్రజలకు ఇస్తాం. దాని ద్వారా ఫిర్యాదులను, తమ సమస్యల్ని మా దృష్టికి తెస్తే వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
మహాప్రభ: సీఎంసీ తొలి కమిషనర్‌గా మీ ప్రాధామ్యాలేంటి?