mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 6:50 am Digital Edition : Namastey Mahaaprabha

షీ టీమ్స్‌తో ప్రతి మహిళకూ న్యాయం

పబ్లిక్‌ ప్లేసె్‌సలో తాము ఎదుర్కొనే సమస్యలను స్వేచ్ఛగా చెప్పగలిగే వేదికను సృష్టించాలనే ఆలోచన నుంచే షీ టీమ్స్‌ ఉద్భవించిందని రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ స్వాతి లక్రా అన్నారు.

  • అడిషనల్‌ డీజీపీ స్వాతి లక్రా

హైదరాబాద్‌ సిటీ ఫిబ్రవరి 24 మహాప్రభ : పబ్లిక్‌ ప్లేసె్‌సలో తాము ఎదుర్కొనే సమస్యలను స్వేచ్ఛగా చెప్పగలిగే వేదికను సృష్టించాలనే ఆలోచన నుంచే షీ టీమ్స్‌ ఉద్భవించిందని రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ స్వాతి లక్రా(State Additional DGP Swati Lakra) అన్నారు. యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వై ఫ్లో) 20వ వార్షికోత్సవాన్ని బంజారాహిల్స్‌లో సోమవారం రాత్రి నిర్వహించారు. వైఫ్లో మాజీ ఛైర్‌పర్సన్లతో పాటుగా వైఫ్లో సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన మహిళలతో చర్చా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ ప్రతి మహిళకూ న్యాయం జరిగేందుకు తోడ్పడుతున్నామన్న ఆమె, మహిళలు సురక్షితమనే భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో మహిళల్లో ధైర్యం లోపించిందని తాను అనుకోవడం లేదంటూ, నగరాల్లో పరిస్థితులు మెరుగ్గానే కనిపిస్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. బయలాజికల్‌ ఈ అధినేత్రి మహిమా దాట్ల మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఏఐని వినియోగిస్తున్నప్పటికీ, వాలిడేషన్‌ పరంగా మానవ మేథస్సే కీలకమని అన్నారు.

విద్యావేత్త అంజుమ్‌ బాబూఖాన్‌ సమన్వయం చేసిన ఈ చర్చలో వైఫ్లో చైర్‌పర్సన్‌ పల్లవి జైన్‌, సినీ నిర్మాత స్వప్న దత్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ మంజుల అనగాని, నారాయణ సంస్థల అధినేత్రి డాక్టర్‌ పి.సింధూర నారాయణ, ఫ్యాషన్‌ డిజైనర్‌ జయంతి రెడ్డి, ఆర్ట్‌, మానసిక ఆరోగ్య రంగాలకు చెందిన మిహీకా దగ్గుబాటి తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.