గోవాలో ఒక వ్యక్తికి పారాసైలింగ్ అనుభవం భయానకంగా మారింది. సరదాగా ప్రారంభమైన ఈ సాహసం మధ్యలోనే ప్రమాదకరంగా పరిణమించింది. పారాసైలింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కేబుల్ తెగిపోవడంతో టూరిస్ట్ ప్రమాదంలో చిక్కుకున్నాడు.
మార్చి 31 (మహాప్రభ) : గోవాలో ఒక వ్యక్తికి పారాసైలింగ్ అనుభవం భయానకంగా మారింది. సరదాగా ప్రారంభమైన ఈ సాహసం మధ్యలోనే ప్రమాదకరంగా పరిణమించింది. పారాసైలింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కేబుల్ తెగిపోవడంతో టూరిస్ట్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Goa parasailing accident).ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు గోవాలోని బీచ్‌లలో వాటర్ స్పోర్ట్స్‌ను ఆస్వాదిస్తుంటారు. తాజాగా ఓ పర్యాటకుడు బాగా బీచ్ దగ్గర పారాసైలింగ్ చేశాడు. గాలిలో ఉండగానే పారాచ్యూట్ తాడు తెగిపోవడంతో, ఆ పర్యాటకుడు సముద్రంలో పడిపోయాడు. వీడియోలో టూరిస్ట్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కింద పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే అతడు లైఫ్ జాకెట్ ధరించి ఉండడంతో ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది (Tourist parasailing video Goa).
ఈ ఘటనతో గోవాలో అడ్వెంచర్ స్పోర్ట్స్ భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. @anilchandela83 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు (Cable snaps mid air). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 90 లక్షల మంది వీక్షించారు. గోవాలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయని కొందరు కామెంట్లు చేశారు. కాగా, ఈ ఘటనపై గోవా పర్యాటక శాఖ విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యం రుజువైతే లైసెన్సు సస్పెన్షన్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.