mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 6:42 am Digital Edition : Namastey Mahaaprabha

షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.. : Mahaaprabha

గత కొద్ది రోజులుగా పడుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు బుధవారం యూటర్న్ తీసుకున్నాయి. భారీ పెరుగుదల నమోదు చేశాయి. కొనుగోలుదారులకు షాక్ కలిగించే స్థాయిలో పెరిగాయి. ఈ రెండు లోహాల ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో మళ్లీ పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

ఫిబ్రవరి 4 మహాప్రభ : గత కొద్ది రోజులుగా పడుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు బుధవారం యూటర్న్ తీసుకున్నాయి. భారీ పెరుగుదల నమోదు చేశాయి. కొనుగోలుదారులకు షాక్ కలిగించే స్థాయిలో పెరిగాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో ఇటీవల భారీగా లాభాల స్వీకరణ జరిగింది. ఈ రెండు లోహాల ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో మళ్లీ పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు (Gold prices Live).ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 4న) ఉదయం 10:00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,60,530కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా 6,600 రూపాయలు పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,150కి చేరింది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే 6,050 రూపాయలు పెరిగింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,60,680కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,47,300కి చేరుకుంది.ఇక, పెట్టుబడిదారులకు భారీ నష్టాలను మిగిల్చిన వెండి కూడా యూటర్న్ తీసుకుంది. ఇటీవల భారీగా పతనమైన వెండి బుధవారం షాక్ ఇచ్చింది. మళ్లీ రూ.3 లక్షల మార్క్ దాటింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ.40 వేల మేర పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3.2 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.3.2 లక్షలుగా ఉంది

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.