mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 6:45 am Digital Edition : Namastey Mahaaprabha

శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ దాడులు.. వాటిపై ఫోకస్..

శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు సోమవారం విసృత తనిఖీలు చేపట్టారు. డీసీసీబీ కాలనీలోని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందం ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించారు.

శ్రీకాకుళం, మార్చి 2 మహాప్రభ : శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు ఇవాళ(సోమవారం) విసృత తనిఖీలు చేపట్టారు. డీసీసీబీ కాలనీలోని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందం ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించారు. జనవరి 28వ తేదీన కంచిలి ప్రాంతంలో బాలముకుందం వార్డెన్ల నుంచి రూ. 1.84 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. ఆయనపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు.

విద్యార్థుల నుంచి రూ.5లు వసూలు..

బీసీ హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థుల నుంచి నెలవారీగా రూ.5లు వసూలు చేస్తున్నట్లు బాలముకుందంపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల కారణంగా ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు.ఏసీబీ సోదాల సమయంలో బాలముకుందం నివాసాల నుంచి సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.