mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 6:53 am Digital Edition : Namastey Mahaaprabha

శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా.. సీఎం చంద్రబాబు సమీక్ష

శ్రీకాకుళంలో కొందరు డయేరియా బారినపడ్డారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. మొత్తం 32 మంది డయేరియాకు గురైనట్టు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు అధికారులు.

అమరావతి, ఫిబ్రవరి 24 మహాప్రభ : శ్రీకాకుళంలో కొందరు డయేరియా బారినపడ్డారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. మొత్తం 32 మంది డయేరియాకు గురయ్యారని ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులు వెల్లడించారు. వారిలో 10 మంది ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని తెలిపారు. మరో 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సీఎంకు వివరించారు.శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల రహదారి మరమ్మతులు జరిగాయని అధికారులు తెలిపారు. ఆ సందర్భంలో మంచి నీరు కలుషితమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. డయేరియా బాధితుల కోసం ఇప్పటికే హెల్త్ క్యాంపులు ఏర్పాటుచేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు.