mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 12:18 pm Digital Edition : Namastey Mahaaprabha

శుభవార్త చెప్పిన అఫ్గాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్.. ఏంటంటే?

అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్‌ ర‌షీద్ ఖాన్ తండ్రయ్యాడు. అత‌డి భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రషీద్‌ ఇన్ స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 18 (మహాప్రభ) : అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్‌ ర‌షీద్ ఖాన్ తండ్రయ్యాడు. అత‌డి భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రషీద్‌ ఇన్ స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. తన చిన్నారికి ‘అస్లాన్ ఖాన్’ అని పేరు పెట్టినట్లు అతడు వెల్లడించాడు. ‘ఈ ప్రపంచంలోకి నా రాకుమారుడికి స్వాగతం’ అంటూ రషీద్ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో అతడికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రషీద్ ఖాన్2025 ఆగస్టులో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందు 2024 అక్టోబర్‌లో పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్ మొదటి పెళ్లి జరిగింది. కానీ ఏడాది గడవక ముందే వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు తన రెండో భార్యకు మగ బిడ్డ జన్మించడంతో రషీద్ తండ్రయ్యాడు. ఇక రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌ 2026లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సీజ‌న్‌లో రషీద్ ఖాన్ గుజరాత్ తరఫున ఆడుతున్నాడు. అతడు ఇప్పటివ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంతేకాక గుజరాత్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అలానే గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండు ఓటముల తర్వాత తిరిగి విజయాల బాట పట్టింది. ఇటీవల వరుసగా మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. ఇక తండ్రైన రషీద్ ఖాన్‌కు సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.