శాసనమండలిలో నియంతలా బొత్స వ్యవహారం: పంచుమర్తి అనురాధ

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్ సెషన్ అంతా గాలికి వదిలేసి చర్చ జరగకుండా చేశారని మండిపడ్డారు. అమరావతి, ఫిబ్రవరి 26 మహాప్రభ : వైసీపీ నేతలపై శాసనమండలి చీఫ్‌ విప్ పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిల్‌లో వైసీపీ సభ్యులు అనేక నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సమాధానం చెబుతుంటే అడ్డుకుంటున్నారన్నారు. బడ్జెట్ సెషన్ అంతా గాలికి వదిలేసి చర్చ జరగకుండా చేశారని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు...