శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు..

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. విమానాశ్రయం టెర్మినల్‌లో బాంబు పెట్టినట్లు అగంతకులు మెయిల్ చేశారు. హైదరాబాద్ ఏప్రిల్ 25 (మహాప్రభ) : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. విమానాశ్రయం టెర్మినల్‌లో బాంబు పెట్టినట్లు అగంతకులు మెయిల్ చేశారు. దీంతో ఎయిర్‌పోర్ట్ మెుత్తం ఒక్కసారిగా కలకలం రేగింది. బాంబు బెదిరింపు విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వింగ్ వెంటనే తనిఖీలు చేపట్టింది. తనిఖీల అనంతరం ఎటువంటి బాంబు లేదని నిర్ధారించింది....