వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి
ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతలు చెప్పులు, బూట్లు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకోవడంపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై న్యాయ నిపుణులతో మాట్లాడానని, స్వామివారి పట్ల అపచారం చేసిన వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 మహాప్రభ : శాసనమండలిలో వైసీపీ నేతలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పట్ల చూపిన వ్యవహారాన్ని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు....