వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారు: ధూళిపాళ్ల నరేంద్ర

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణపై ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారో చెప్పాలన్నారు. గుంటూరు జిల్లా ఏప్రిల్ 11 (మహాప్రభ) : వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కన్నీటికి కారణం ఏంటో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) డిమాండ్ చేశారు. గతంలో బొత్స చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకోవడానికే ఈ కన్నీరు అంటూ ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ రెడ్డి ఎక్కడ ఉన్నారో స్పష్టంగా...