వెస్టిండీస్‌ను తక్కువగా అంచనా వేయొద్దు.. టీమిండియాకు సన్నీ హెచ్చరిక

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా మార్చి 1న కోల్‌కతా వేదికగా వెస్టిండీస్-భారత్ జట్లు చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే సెమీస్‌కు వెళ్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియాను మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ హెచ్చరించాడు. ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 27 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో జింబాబ్వేపై విజయం సాధించిన టీమిండియా సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. లీగ్ స్టేజీని అజేయంగా ముగించి.. సూపర్ 8లో సౌతాఫ్రికాపై ఓటమిపాలవ్వడంతో సెమీస్ ఆశలు కాస్త సంక్లిష్టంగా...