mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 6:28 am Digital Edition : Namastey Mahaaprabha

వెనక్కి తగ్గిన తుషార.. శ్రీలంక బోర్డుకు క్షమాపణలు..

శ్రీలంక క్రికెట్ బోర్డు‌కు ఆ దేశ స్టార్ పేసర్ నువాన్ తుషార క్షమాపణలు చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు అవసరమయ్యే నిరభ్యంతర పత్రం ఇవ్వనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్‌పై తుషార కోర్టుకెక్కాడు. తాజాగా ఆ కేసును వాపసు తీసుకున్నాడు.

ఏప్రిల్ 11 (మహాప్రభ) :శ్రీలంక క్రికెట్ బోర్డు‌కు ఆ దేశ స్టార్ పేసర్ నువాన్ తుషార క్షమాపణలు చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు అవసరమయ్యే నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్‌పై తుషార కోర్టుకెక్కాడు. తాజాగా ఆ కేసును వాపసు తీసుకున్నాడు. అంతేకాకుండా క్షమాపణలు కూడా చెప్పాడు. బోర్డుకు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని ఈమెయిల్ పంపించాడు (Nuwan Thushara apology).

తన పట్ల శ్రీలంక క్రికెట్ బోర్డు పారదర్శకంగా వ్యవహరించలేదని, తనకు న్యాయం జరగాలనే కారణంతోనే కేసు వేసినట్టు తుషార పేర్కొన్నాడు. కేసు వేయడం వల్ల ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని తాజాగా విజ్ఞప్తి చేశాడు. క్రికెట్ బోర్డుకు సహకరించేందుకు సిద్ధమని తెలిపాడు. ఈ పరిణామంతో తుషార కెరీర్‌పై ఉన్న అనిశ్చితి తగ్గే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ జాతీయ జట్టులో అతడికి ఛాన్స్ లభించే అవకాశాలు మెరుగయ్యాయి (Sri Lanka Cricket NOC issue).

ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసయ్యే ఆటగాళ్లకే ఐపీఎల్‌లో ఆడేందుకు అవకాశం కల్పిస్తామని ఇటీవల శ్రీలంక క్రికెట్ బోర్డ్ షరతు పెట్టింది (SLC controversy). 31 ఏళ్ల తుషార.. శ్రీలంక క్రికెట్ బోర్డ్ పెట్టిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిలయ్యాడు. దీంతో అతడికి క్రికెట్ బోర్డ్ ఎన్‌ఓసీ ఇవ్వలేదు. కాగా, 2024లో ముంబై ఇండియన్స్ తరఫున తుషార ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. గతేడాది నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు.