విజయవాడలోని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సమీపంలో రహదారిపై కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై..కారులో ప్రయాణిస్తున్న వారికి తెలిపారు.
విజయవాడ ఏప్రిల్ 6 (మహాప్రభ) : నగరంలోని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సమీపంలో రహదారిపై కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై..కారులో ప్రయాణిస్తున్న వారికి తెలిపారు. వారు వెంటనే కారు ఆపి అందులో నుంచి దిగిపోయారు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు దగ్ధమైంది.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రద్దీ ప్రాంతమైన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి.. రహదారిపై నుంచి కారును పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.