mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 7:00 am Digital Edition : MAHAA PRABHA DAILY

వావ్.. సూపర్ ఐడియా.. పులి బొమ్మను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా..

సాధారణంగా ఇంటి డాబాల మీద ఏవైనా ఆరబెడితే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పక్షులు, కోతులు, ఇతర జంతువులు వంటివి రాకుండా అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. అందుకోసం ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సి ఉంటుంది.

మార్చి 30 (మహాప్రభ) : సాధారణంగా ఇంటి డాబాల మీద ఏవైనా ఆరబెడితే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పక్షులు, కోతులు, ఇతర జంతువులు వంటివి రాకుండా అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. అందుకోసం ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సి ఉంటుంది. అయితే ఓ మహిళ తన అద్భుతమైన తెలివితేటలు ఉపయోగించి ఈ సమస్యకు చెక్ పెట్టింది. ఆ ఫొటో చూస్తే ఆమె తెలివితేటలకు ఫిదా కావాల్సిందే (viral photo).

@Abs261 అనే ఎక్స్ యూజర్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ ఫొటో చూస్తే నవ్వుకోవాల్సిందే. ఆ ఫొటో ప్రకారం, కొన్ని వస్తువులను ఆరబెట్టడానికి డాబాపై ఉంచారు. అయితే వాటిని ఏవీ పాడుచేయకుండా ఉండడానికి పక్కనే ఓ పులి బొమ్మను ఉంచారు. అది నిజం పులే అనుకుని అక్కడకు ఏవీ వచ్చే అవకాశం లేదు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (social media trending).