వలస కార్మికులకు ఊరట.. 5 కిలోల సిలిండర్ల కోటా రెట్టింపు
దేశంలో ఎల్‌పీజీ కొరతను అధిగమించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు కేటాయించే 5 కిలోల చిన్న సిలిండర్ల సరఫరా కోటాను రెట్టింపు చేసింది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 7 (మహాప్రభ) : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 5 కిలోల చిన్న ఎల్‌పీజీ సిలిండర్లకు ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ(FTL) సరఫరాను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. రాష్ట్రాలకు కేటాయించే ఎఫ్‌టీఎల్ సిలిండర్ల కోటాను రెట్టింపు చేసింది. మార్చి 21...