mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 10:06 am Digital Edition : Namastey Mahaaprabha

వరుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

వరుడు పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగాక ఆ యువకుడు.. ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఈ దారుణ నిర్ణయం తీసుకుంది.

కడప ఏప్రిల్ 22 (మహాప్రభ) : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరుడు పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగాక ఆ యువకుడు.. ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఈ దారుణ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కడప చిన్న చౌకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

కడప పటేల్ రోడ్డు ప్రాంతానికి చెందిన రెహానా(26) అనే యువతి ఎమ్మెస్సీ పూర్తి చేసింది. గవర్నర్ చేతుల మీదుగా ఇటీవలే పట్టా కూడా అందుకుంది. రెహానాకు ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్ తో ఫిబ్రవరి 15న నిశ్చితార్థం జరిగింది. అతడు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. నిశ్చితార్థం కావడంతో వీరిద్దరూ రోజు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. చాటింగ్ కూడా చేసుకునేవారు. ఇటీవల సదరు యువకుడు రెహానాతో.. నువ్వంటే ఇష్టం లేదు. నాకు ఇదివరకే నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు’ అని అన్నాడు. ఏదో తమాషాగా అంటున్నాడని తొలుత రెహానా పట్టించుకోలేదు. పదే పదే అతడు అవే మాటలు అంటూ ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సోమవారం గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని 12 పేజీల సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. రెహానా తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తుందనుకున్న తమ బిడ్డా విగతజీవిగా మారడంతో మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.