రైతు బంధు బంద్.. కొత్తగా రాహుల్ బంధు పథకం: కేటీఆర్
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమేనా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. మూడో పంటకు రైతు బంధు వేయాలని డిమాండ్ చేశారు. కానీ నేటికి మూడో నెల వచ్చిన రైతు బంధు వేయలేదని రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల, మార్చి 09 మహాప్రభ : రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని బంద్ చేసి.. కొత్తగా రాహుల్ బంధు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకు వచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,...