రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. ఓ యువకుడిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసింది. హైదరాబాద్ ఏప్రిల్ 2 (మహాప్రభ) : మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. స్థానికంగా ఉంటున్న వారి పట్ల ఈ గ్యాంగ్ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌ ఓ యువకుడిపై విచాక్షణారహితంగా దాడి చేసింది. శాస్త్రీపురంలో ఫహాద్ అనే యువకుడిపై కత్తులు, రాడ్స్‌తో దాడి చేసింది గంజాయి బ్యాచ్. తీవ్రంగా గాయపడిన ఫహాద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు....