రెండు రోజుల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన దేశీయ సూచీలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. రెండు రోజుల లాభాలకు బ్రేక్‌నిస్తూ నేడు భారీ నష్టాలను చవిచూశాయి. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 27 (మహాప్రభ) : దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నేలచూపులు చూశాయి. రెండు రోజుల వరుస లాభాల అనంతరం.. నేడు భారీ నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, పెరిగిన చమురు ధరలతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఉదయం 74,883 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. ఆది నుంచీ భారీ నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,534...