రాయవరం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఏపీ మంత్రులు..

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం బస్సు ప్రమాద బాధితులను ఏపీ మంత్రులు పరామర్శించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, క్షతగాత్రులు కోలుకుని ఇంటికి వెళ్లే దాకా చంద్రబాబు సర్కార్ బాధ్యత తీసుకుంటుందని వారు తెలిపారు. ప్రకాశం మార్చి 27 (మహాప్రభ) : మార్కాపురం మండలం రాయవరం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామర్శించారు. ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్సపొందుతున్న బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అధికారులు, వైద్యులను అడిగి...