mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 7:26 am Digital Edition : Namastey Mahaaprabha

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల .. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదలైంది. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 26న నోటిఫికేషన్ ఇస్తారు. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 గడువు తేదీ. 6న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు మార్చి 9 వరకు గడువు.

మహాప్రభ, ఫిబ్రవరి 18: భారత ఎన్నికల సంఘం (ECI) రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 18, 2026)న విడుదల చేసింది. దీని ప్రకారం 10 రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలు ఏప్రిల్ 2026లో వివిధ తేదీల్లో ఖాళీ అవుతున్నాయి. వీటిలో తెలంగాణ నుంచి 2 స్థానాలు (కేఆర్ సురేష్ రెడ్డి – BRS, అభిషేక్ మను సింఘ్వీ- INC) ఉన్నాయి. వీరి పదవీకాలం ఏప్రిల్ 9, 2026తో ముగుస్తుంది. వీటిని ద్వైవార్షిక ఎన్నికల భాగంగా ఇప్పుడు భర్తీ చేయనున్నారు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్.. కీలక తేదీలు:

నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26, 2026

నామినేషన్ల దాఖలు చేసే చివరి తేదీ: మార్చి 5, 2026

నామినేషన్ల పరిశీలన: మార్చి 6, 2026

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 9, 2026

పోలింగ్: మార్చి 16, 2026 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

ఓట్ల లెక్కింపు: మార్చి 16, 2026 సాయంత్రం 5 గంటలకు (పోలింగ్ ముగిసిన వెంటనే)

ఈ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల (MLAs) ఓట్ల ద్వారా జరుగుతాయి. పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.

స్థానాలు ఖాళీ అయ్యే రాష్ట్రాల వివరాలు (మొత్తం 37 సీట్లు):

మహారాష్ట్ర: 7 స్థానాలు

తమిళనాడు: 6 స్థానాలు

పశ్చిమ బెంగాల్: 6 స్థానాలు (ఒకటి జనవరి 5, 2026 నుంచి ఖాళీ)

బిహార్: 4 స్థానాలు

అస్సాం: 3 స్థానాలు

ఒడిశా: 3 స్థానాలు

ఛత్తీస్‌గఢ్: 2 స్థానాలు

తెలంగాణ: 2 స్థానాలు

హర్యానా: 1 స్థానం

హిమాచల్ ప్రదేశ్: 1 స్థానం

ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీకి దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, BRS మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. ఎన్నికల సంఘం ప్రకారం, ఈ స్థానాలు ఏప్రిల్‌లో వివిధ తేదీల్లో ఖాళీ అవుతాయి కావున, మార్చి 16నే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.