రాజమహేంద్రవరం ఘటన.. పాల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నంలోని పలు పాల కేంద్రాలపై అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మచిలీపట్నం, ఫిబ్రవరి 25 మహాప్రభ : రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఏపీలోని వివిధ జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల సరఫరా కేంద్రాలు, డైరీలపై తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం ఉదయం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పలు పాల కేంద్రాలపై అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి ప్రాంతంలోని...