రష్యా ముడి చమురుపై యూఎస్ యూటర్న్
రష్యా చమురు కొనుగోళ్లపై ఇచ్చిన సడలింపులను మరో నెల రోజుల పాటు కొనసాగిస్తూ యూఎస్ ట్రెజరీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 18 (మహాప్రభ) : రష్యా చమురుపై ఆంక్షల సడలింపులను కొనసాగించేది లేదన్న అమెరికా తాజాగా యూటర్న్ తీసుకుంది. మరో నెల రోజుల పాటు ఈ సడలింపులను కొనసాగిస్తున్నామని ప్రకటించింది. రష్యా పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లను ఇతర దేశాలు కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా చమురు కొనుగోలుకు...