యూట్యూబర్ అన్వేష్‌పై లుక్‌అవుట్ నోటీసులు

నా అన్వేషణ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవలే అన్వేష్‌ అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. హైదరాబాద్, ఫిబ్రవరి 25 మహాప్రభ : ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)కు మరో బిగ్‌షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్ అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అతడు తనకు ఇంకా రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని వీడియో విడుదల చేశారు....