మొజ్తాబా ఖమేనీకి పుతిన్ అభినందనలు, కొత్త సుప్రీంను టార్గెట్‌ చేయవద్దన్న చైనా

ఇరాన్ కొత్త సుప్రీం నేత మజ్తాబా ఖమేనీకి రష్యా అభినందనలు చెప్పగా, కొత్త సుప్రీంను మట్టుబెడతామంటూ ఇజ్రాయెల్ మిలటరీ చేస్తున్న హెచ్చరికలతో చైనా విభేదించింది. టెహ్రాన్ మార్చి 09 మహాప్రభ : అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరిపి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని మట్టుబెట్టడంతో పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్, బీరుట్‌కు విస్తరించింది. ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. ఇరాన్‌ను విడగొట్టి దేశం నుంచి చమురును...