mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 12:18 pm Digital Edition : Namastey Mahaaprabha

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా.. నల్గొండలో క్లీన్ స్వీప్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది.

నల్గొండ, ఫిబ్రవరి 13 మహాప్రభ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఇక, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 6 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది.

కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన 6 మున్సిపాలిటీలు

  • చండూరు మున్సిపాలిటీ
  • చిట్యాల మున్సిపాలిటీ
  • దేవరకొండ మున్సిపాలిటీ
  • హాలియా మున్సిపాలిటీ
  • మిర్యాలగూడ మున్సిపాలిటీ
  • నందికొండ మున్సిపాలిటీ