mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 9:04 am Digital Edition : Namastey Mahaaprabha

మున్సిపల్ ఎన్నికలు… సెలవు ప్రకటించిన సర్కార్.. : Mahaaprabha

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు వర్తించనుంది..

హైదరాబాద్, ఫిబ్రవరి 10 మహాప్రభ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ (Telangana Municipal Elections) నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (బుధవారం) పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించింది సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు వర్తించనుంది. అంతేకాకుండా, మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే ఈ సెలవు వర్తించనుంది.తెలంగాణ వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,301 బాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. రేపు (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలను ప్రకటించనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సమయంలో మద్యం షాపులు మూసేయడంతో పాటు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.