mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 12:19 pm Digital Edition : Namastey Mahaaprabha

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్‌ ఇంజన్‌, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.

తిరుపతి ఫిబ్రవరి 17 మహాప్రభ : వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్‌ ఇంజన్‌, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది. అందులో పైలట్లు, వెనుక సిగ్నల్‌మెన్‌ తప్ప ప్రయాణికులెవ్వరులేరు. ఖాళీగా దూసుకెళ్తుండడం చూపురులను ఆకట్టుకుంది.

ప్రయోగాత్మకంగా కొన్ని కిలోమీటర్లు నడపడంతో పాటు ఎక్కడి నుంచి ప్రవేశపెట్టాలో ఆ ప్రాంతానికి ముందుగానే చేర్చే క్రమంలో ఆ రైలు పరుగులు పెట్టిందని అధికారులు తెలిపారు. 17480 నెంబర్‌తో ప్రతినిత్యం ఉదయం 11.05గంటలకు తిరుపతి(Tirupati) నుంచి పూరికి బయల్దేరుతుంది. అలాగే రాత్రి 17479 నెంబర్‌తో రాత్రి 8.05గంటలకు తిరుపతికి చేరుకొని ఆగుతుంది. ఇలా మొత్తం నాలుగు రైళ్లు నడుస్తూ ప్రతిరోజు నిర్దేశిత సమయానికి రాకపోకలు సాగిస్తాయి.