మానవత్వం చాటుకున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ – మహాప్రభ
క్షతగాత్రులను స్వయంగా అంబులెన్సులో ఎక్కించిన ఆసుపత్రికి తరలించిన అదనపు ఎస్పీఅక్కన్నపేట (మహాప్రభ) మెదక్ జిల్లా - 28 జనవరి : గ్రామ శివారులోని అక్కన్నపేట ఫారెస్ట్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్వాపూర్ గ్రామం నుంచి పాతూర్ సంతకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అదే వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడగా, ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.ఇదే...