mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 7:10 am Digital Edition : Namastey Mahaaprabha

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

జగిత్యాల,ఫిబ్రవరి 20 మహాప్రభ  : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ కావడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. అందువల్లే ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు వివరించారు.మరోవైపు మున్సిపల్ ఎన్నికల నుంచి వాటి ఫలితాలతో పాటు ఛైర్మన్ ఎన్నిక వరకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. వాతావరణ పరిస్థితుల మార్పు తదితర కారణాల వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యారని కార్యకర్తలు పేర్కొంటున్నారు.ఇక.. రాష్ట్రంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే సంజయ్ వర్గం, జీవన్ రెడ్డి వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగి.. సంజయ్ వర్గానికి ఛైర్మన్ పదవి, జీవన్ రెడ్డి వర్గానికి వైస్ ఛైర్మన్ పదవి కేటాయించిన విషయం విదితమే.