mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 6:46 am Digital Edition : Namastey Mahaaprabha

మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్

పశ్చిమాసియాలో పరిస్థితులు త్వరలో కుదుటపడనున్నాయన్న అంచనాల నడుమ బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 16 (మహాప్రభ) : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు త్వరలో కుదుటపడతాయన్న అంచనాల నడుమ భారత్‌లో బంగారం ధరల్లో నేడూ పెరుగుదల కనిపిస్తోంది. త్వరలో యుద్ధం ముగుస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో కమోడిటీ మార్కెట్స్‌లో లోహాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఏప్రిల్ 16) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర స్వల్పంగా పెరిగి రూ.1,55,570కు చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర కూడా కొద్దిగా ఎగబాకి రూ.1,42,600కు చేరుకుంది. కిలో వెండి ప్రస్తుతం రూ.2.75 లక్షల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో ఇదే రేట్స్ కొనసాగుతున్నాయి.

ఇతర ప్రధాన నగరాల్లో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,660గా ఉంది. ముంబైలో రూ.1,55,570గా, ఢిల్లీలో రూ.1,55,720గా ఉంది. చెన్నైలో ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,600గా ముంబైలో రూ.1,42,600గా, ఢిల్లీలో రూ.1,42,750గా ఉంది. దేశంలో కిలో వెండి ధర రూ.2.75 లక్షల వద్ద తచ్చాడుతోంది. నిన్నటితో పోలిస్తే ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ 24 క్యారెట్ల బంగారం 4,833 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.