మరో మూడేళ్లు విద్యార్థులకు రాగిజావా పంపిణీ.. మంత్రి లోకేశ్ సమక్షంలో ఎంవోయూ
విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమం మరో మూడేళ్లు కొనసాగింపునకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి మే 4 ( మహాప్రభ ) : ఏపీ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్‌తో...