మరో మూడు గంటల్లో ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎండ దంచికొట్టింది. తర్వాతి నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది. హైదరాబాద్ ఏప్రిల్ 23 (మహాప్రభ) : తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎండ దంచికొట్టింది. తర్వాతి నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు గంటల్లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది....