మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారు: మంత్రి కొల్లు రవీంద్ర
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్న బియ్యంతో పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మంచి భోజనం అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా ఏప్రిల్ 4 (మహాప్రభ) : పెనమలూరు ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra), ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో మాట్లాడి టీచర్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో లావు బియ్యంతో భోజనం వడ్డించేవారని, ప్రస్తుతం సన్న...