mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 11:13 am Digital Edition : Namastey Mahaaprabha

మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు.. స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్..

ఉదయం భారీ లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు మధ్యాహ్నం యూటర్న్ తీసుకున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, విదేశీ మదుపర్లు మంగళవారం రూ.102 కోట్లు విలువైన షేర్లను అమ్మేయడంతో కిందకు దిగి వచ్చాయి.

ఫిబ్రవరి 25 మహాప్రభ : ఉదయం భారీ లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు మధ్యాహ్నం యూటర్న్ తీసుకున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, విదేశీ మదుపర్లు మంగళవారం రూ.102 కోట్లు విలువైన షేర్లను అమ్మేయడంతో కిందకు దిగి వచ్చాయి. ఇక, కొద్ది రోజులుగా నిఫ్టీ 25,670 మార్క్‌ను దాటలేకపోతుండడం వల్ల కూడా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో మధ్యాహ్నం వరకు భారీ లాభాలు ఆర్జించిన సూచీలు చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. చివరకు సెనెక్స్, నిఫ్టీ ఓ మోస్తరు లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).గత సెషన్ ముగింపు (82,225)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 220 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగిసింది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడి 82,957 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం అమ్మకాలు మొదలు కావడంతో కిందకు దిగి వచ్చింది. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే మధ్యాహ్నం తర్వాత 800 పాయింట్లు పడిపోయింది. చివరకు 50 పాయింట్ల లాభంతో 82,276 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 57 పాయింట్ల లాభంతో 25,482 వద్ద స్థిరపడింది (stock market news today).సెన్సెక్స్‌, నిఫ్టీలో మ్యాన్‌కైండ్ ఫార్మా, నాల్కో, వేదాంత, లారస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఐఆర్‌ఎఫ్‌సీ, మణప్పురం ఫైనాన్స్, అదానీ ఎనర్జీ, హిందుస్థాన్ పెట్రో, సుజ్లాన్ ఎనర్జీ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 339 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.95గా ఉంది.