మద్యం మత్తులో చేసే చాలా సాహసాలు ప్రాణాపాయానికి దారి తీస్తాయి. పూర్తి స్పృహలో లేకుండా ప్రమాదాలతో ఆటలాడితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. తాజాగా మహారాష్ట్రలోని విరార్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు.
ఫిబ్రవరి 23 మహాప్రభ : మద్యం మత్తులో చేసే చాలా సాహసాలు ప్రాణాపాయానికి దారి తీస్తాయి. పూర్తి స్పృహలో లేకుండా ప్రమాదాలతో ఆటలాడితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. తాజాగా మహారాష్ట్రలోని విరార్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Virar snake incident).విరార్‌లోని నవాపూర్ ప్రాంతంలో ఓ తాచు పాము జనావాసంలోకి వచ్చింది. దానిని చూసి అందరూ భయపడ్డారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాన్ని ఒట్టి చేతులతో పట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా దానిని పట్టుకుని స్టంట్లు చేశాడు. పాముకు ముద్దులు పెట్టాడు. దానిని వదిలెయ్యమని చుట్టు పక్కల వారు హెచ్చరిస్తున్నా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వినలేదు. చివరకు ఆ పాము అతడి చేతిపై కాటు వేసింది. దీంతో అతడి శరీరమంతా విషం వ్యాపించింది (Dangerous stunt death).స్థానికులు అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు (Snake handling accident). అయితే చికిత్స ప్రారంభించేలోపే అతడు మృతిచెందాడు. మృతుడిని రాజూ చందూ బర్డ్ (40)గా గుర్తించారు. పామును మెడలో వేసుకుని తిరుగుతున్న సమయంలోనే అది అతడి చేతిపై కాటు వేసింది. మద్యం మత్తులో ఉన్న అతడు ఆ విషయాన్ని గుర్తించలేదు. దీంతో విషం శరీరమంతా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదకర విన్యాసాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.