mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 11:51 am Digital Edition : Namastey Mahaaprabha

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కర్నూలు కోవాబన్ వలీకి మంత్రి నారా లోకేశ్ అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.

రాజమండ్రి, ఫిబ్రవరి 18 మహాప్రభ : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై (Nara Lokesh) మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ప్రశంసలు కురిపించారు. కర్నూలు కోవాబన్ వలీకి మంత్రి నారా లోకేశ్ అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు. బీజేపీ అలయన్స్‌లో ఉండి ముస్లింకి లోకేశ్ అండగా నిలవడంపై అభినందించాలని పేర్కొన్నారు. రాజమండ్రిలో ఇవాళ(బుధవారం) మీడియాతో ఉండవల్లి మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రావాల్సిన రూ.80 వేల కోట్ల కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా కూడా విభజన హామీలు ఇంకా అమలు కాలేదని పేర్కొన్నారు.