mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 4:51 am Digital Edition : Namastey Mahaaprabha

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.. : Mahaaprabha

గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. బంగారం గ్రాముకు రూ.2500కు పైగా తగ్గింది. వెండి కిలోకు రూ.15,000 మేర తగ్గుదల నమోదు చేసింది.గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. బంగారం గ్రాముకు రూ.2500కు పైగా తగ్గింది. వెండి కిలోకు రూ.15,000 మేర తగ్గుదల నమోదు చేసింది (Gold prices Live).

ఫిబ్రవరి 13 – మహాప్రభ : ఈ రోజు (ఫిబ్రవరి 13న) ఉదయం 10:00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,55,780కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,620 రూపాయలు తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800కి చేరింది (Live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,400 రూపాయలు తగ్గింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,55,930కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,42,950కి చేరుకుంది.ఇక, వెండి ధర కూడా భారీగా తగ్గింది. (Silver Rates Live). మళ్లీ రూ.3 లక్షల మార్క్‌ దిగువకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.15 వేల మేర పడిపోయింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.8 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.