భానుడి ప్రతాపం.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ ఏప్రిల్ 14 (మహాప్రభ) : తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈరోజు(మంగళవారం) రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీలు నమోదు అయ్యింది. ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ స్థాయి...