mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:55 am Digital Edition : Namastey Mahaaprabha

భానుడి ప్రతాపం.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

హైదరాబాద్ ఏప్రిల్ 14 (మహాప్రభ) : తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈరోజు(మంగళవారం) రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీలు నమోదు అయ్యింది. ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి.

ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ, మధ్యాహ్నం అత్యధిక స్థాయికి చేరుతోంది. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా కార్మికులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు.