mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 11:43 am Digital Edition : Namastey Mahaaprabha

భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు: సీఎస్ రామకృష్ణారావు

భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌‌ని పరిశుభ్రంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 18 మహాప్రభ : భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Telangana CS Ramakrishna Rao) స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌‌ని పరిశుభ్రంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో అధికారులతో ఇవాళ(బుధవారం) సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్‌ పరిశుభ్రతపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భాగ్యనగరంలో రోజుకు 7,800 టన్నుల చెత్త సేకరణ జరుగుతోందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 4,500 స్వచ్ఛ ఆటోలతో ఇంటింటికీ చెత్త సేకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 18,557 మంది శానిటేషన్ సిబ్బంది సేవలు అందిస్తున్నట్లు అధికారులు నివేదికలో ప్రస్తావించారు. తడి, పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించినట్లు స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సీఎస్ రామకృష్ణారావు హెచ్చరించారు