mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 12:09 pm Digital Edition : Namastey Mahaaprabha

భాగ్యనగరంలో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.! : Mahaaprabha

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 6 మహాప్రభ : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు(Jubilee Hills Robbery) రెచ్చిపోయారు. ఆ ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వాచ్‌మన్‌కు మత్తు మందు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. రూ.20 లక్షలు విలువ చేసే బంగారం, డైమండ్స్ దోచుకెళ్లారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. నందగిరి హిల్స్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు సీసీ టీవీలను పరిశీలించారు. మొదటగా.. ఆ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న వాచ్‌మన్‌కు మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఆపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేశారు. వాచ్‌మన్ మత్తులోకి జారుకోగానే దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి లాకర్‌లోని బంగారు ఆభరణాలు మొత్తం ఎత్తుకెళ్లారు. ఈ చోరీ కేసులో నలుగురు నేపాలీలను ప్రధాన అనుమానితులుగా భావిస్తున్నారు పోలీసులు.

దొంగల కోసం గాలింపు..

బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దొంగలు నగరం విడిచి వెళ్లకుండా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఈ తరహా నేరాలకు పాల్పడిన పాత నేరస్థుల జాబితాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నగరంలో నేపాలీ గ్యాంగ్‌ల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పని మనుషులు, వాచ్‌మెన్‌లను నియమించే సమయంలో వారి ఆధార్ కార్డులు, పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని పోలీసులు సూచిస్తున్నారు.