భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

భద్రాలచంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముహూర్త సమయాన సీతమ్మను మనువాడారు రామయ్య. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భద్రాచలం, మార్చి 27 (మహాప్రభ) : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం(Bhadrachalam Sitarama Kalyanam) అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీసీతారాములను పల్లకిలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్వామివారి కల్యాణ ఘట్టం మొదలైంది. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యల...