భగ్గుమన్న పసిడి ధర! రూ.3 లక్షల మార్కును చేరిన వెండి

సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. మేలిమి బంగారం ధర రూ.2 వేల మేర పెరగ్గా వెండి రూ.25 వేల మేర పెరిగి రూ.3 లక్షల మార్కును దాటింది. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 23 మహాప్రభ: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, భారత్‌లో సోమవారం 10.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,350కు చేరింది. నిన్నటితో పోలిస్తే...